బిజినెస్

కావెండీష్.. జెకె టైర్ వశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బికె బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ కేశోరామ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన కావెండీష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ వశమైంది. కావెండీష్‌ను 2,195 కోట్ల రూపాయలతో జెకె టైర్ అనుబంధ సంస్థ జెకె టైర్ అండ్ జెకె ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. కాగా, ఈ కొనుగోలుతో కేశోరామ్ ఇండస్ట్రీస్ హరిద్వార్ టైర్ల తయారీ ప్లాంట్లు జెకె టైర్ సొంతమైయ్యాయి. జెకె టైర్‌కు ఇప్పటికే 12 ప్లాంట్లుండగా, ఇందులో మూడు మెక్సికోలో ఉన్నాయి. ఈ ప్లాంట్లన్నింటి ఉత్పాదక సామర్థ్యం ఏటా 347 లక్షల టైర్లు. ఈ క్రమంలో హరిద్వార్‌లోని మూడు టైర్ల తయారీ ప్లాంట్లు కూడా జెకె టైర్ ఖాతాలోకి వచ్చాయి. ఈ ప్లాంట్లను కావెండీష్ ఇండస్ట్రీస్ నిర్వహించగా, వీటిలో వివిధ రకాల టైర్లు, ట్యూబులు, ఫ్లాపులు తయారు చేసింది. ఇక ఈ హరిద్వార్ ప్లాంట్ ద్వారా జెకె టైర్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం మరో 100 లక్షల టైర్ల మేర పెరగనుంది. ఇంకో 15 రోజుల్లో హరిద్వార్ ప్లాంట్‌లో తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామని జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ సిఎండి రఘుపతి సింఘానియా సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 10,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన తాజా కొనుగోలుతో ఇకపై ద్విచక్ర, త్రిచక్ర వాహన టైర్ల తయారీలోకి జెకె టైర్ దిగుతోందన్నారు. కావెండీష్ కొనుగోలులో 700 కోట్ల రూపాయలు ఈక్విటీగా, 1,495 కోట్ల రూపాయలు రుణంగా ఉందని చెప్పారు. ఇదిలావుంటే సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో జెకె టైర్ షేర్ విలువ 1.05 శాతం పెరిగి 86.45 రూపాయలకు చేరింది.