బిజినెస్

వెల్లువెత్తిన కందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఫిబ్రవరి 5: చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌కు కందుల వరుద కొనసాగుతోంది. అంచనాలకు మించి కందులు మార్కెట్ వస్తుండడంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో మార్కెట్‌కు సెలవులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మార్కెట్‌కు నాలుగు రోజుల వంతును సెలవులు ప్రకటించారు. ఆదివారం రెండవ దఫా కంది కొనుగోలు కేంద్రం పునఃప్రారంభమైంది. యాదాద్రి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కందులు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్నాయి. మార్కెట్ యార్డు ముందు తెల్లవారుజాము నుంచే వాహనాలు బారులుతీరుతున్నాయి. రోజుకు వంద మంది రైతులకు పైగా కందులను వాహనాలలో మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పప్పు్ధన్యాలను ప్రోత్సహించడంతో పాటు మద్దతు ధరను కూడా చెల్లిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.4625 కాగా బోనస్ రూ.425తో కలిపి రూ.5100 చెల్లిస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాత జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా కంది పంటను సాగు చేశారు. కంది పంట మధ్య దళారీల బారినపడి రైతులు మోసపోకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే యాదాద్రి జిల్లాలో ఆలేరు, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో చండూరులో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకోని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) ఆధ్వర్యంలో కంది కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 11న స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. మొదటగా చెప్పుకోదగ్గ స్పందన లేనప్పటికీ క్రమంగా పుంజుకుంది. రోజుకు సుమారు వంద మంది రైతులు కందులను మార్కెట్‌కు తీసుకువస్తుండడంతో వత్తిడి పెరిగిపోయింది. నిల్వలు పెరిగిపోగానే సెలవులు ప్రకటించి తూకాలు వేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి మరింత వత్తిడి పెరగడంతో ఈ నెల 4వ తేదీ వరకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. వ్యవసాయ మార్కెట్‌కు పూర్వపు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి కందులు వస్తున్నాయి. ఉదయం నుంచే వ్యవసాయ మార్కెట్ ఎదుట కందుల లోడుతో వాహనాలు బారులుతీరుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డు సిబ్బంది గేటు తీయగానే రైతుల వివరాలు, ధాన్యం బస్తాల సంఖ్య నమోదు చేసుకుని టోకెన్ నెంబర్ ఇస్తున్నారు. టోకెన్ ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు ఎనిమిది వేల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. మరో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌లో నిల్వ ఉంది. రైతులు కందులను తీసుకువస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి బిల్లులు చెల్లిస్తున్నారు.
తప్పని దళారుల బెడద
వ్యవసాయ మార్కెట్‌కు మధ్య దళారీల బెడద తప్పడంలేదు. వివిధ ప్రాంతాలలో రైతుల నుంచి మూడు నుంచి మూడున్నర వేలకు క్వింటాలు వంతున కందులను కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చి రూ.5100కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులు తెలివిగా రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలను సైతం తీసుకువచ్చి మోసం చేస్తున్నారు. రైతులు మధ్యదళారీల బారిన పడకుండా చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. కందుల కొనుగోలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వివరాలను ప్రచారం చేసి, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర, బోనస్‌ను తెలియజేసి చైతన్యవంతులను చేయాల్సి అవసరం ఉంది.

చిత్రం..మార్కెట్‌లో రైతులు నిల్వచేసిన కందుల రాసులు