బిజినెస్

ఎన్‌టిపిసికి ఆరేళ్లలో రూ.11 వేల కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి)కు ఆరేళ్లలో దాదాపు 11 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బొగ్గు కొరత, కొనుగోళ్లలో ఇబ్బందులే ఇందుకు కారణమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. 2010 ఏప్రిల్ నుంచి 2016 మార్చి వరకు దేశీయంగా బొగ్గు కొనుగోళ్లు జరిపేందుకు ఎన్‌టిపిసి అదనంగా 6,869.95 కోట్ల రూపాయలను ఖర్చు చేయడంతో పాటు వివిధ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వల కొరత కారణంగా రూ.4,299.80 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, దీంతో దాదాపు రూ.11,000 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఎన్‌టిపిసితో పాటు దాని జాయింట్ వెంచర్లలోని మొత్తం 26 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు గాను 13 కేంద్రాల్లో ఇంధన వనరుల నిర్వహణపై కాగ్ ఆడిటింగ్ నిర్వహించి ఈ నివేదికను రూపొందించింది.