బిజినెస్

16వ నెలా క్షీణతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఎగుమతులు కోలుకున్న దాఖలాలు ఇప్పట్లో కనిపించేలా లేవు. వరుసగా 16వ నెల కూడా దేశీయ ఎగుమతులు క్షీణించాయి. గత నెల మార్చిలో 5.47 శాతానికి పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు దిగజారాయి. దీంతో ఈ మార్చి ఎగుమతుల విలువ 22.71 బిలియన్ డాలర్లుగానే ఉండిపోయింది. మరోవైపు దిగుమతులు కూడా 21.56 శాతం తగ్గగా, 27.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 5.07 బిలియన్ డాలర్లుగా ఉంది. నిరుడు మార్చిలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య లోటు 11.39 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతులు 80.48 శాతం తగ్గి 972.96 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడు మార్చిలో 4.98 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ మేరకు గణాంకాలను సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అయితే తాజా గణాంకాలపై స్పందిస్తూ ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాల ఎగుమతులకు కూడా పతనం బాటలోనే ఉన్నాయని వాణిజ్య శాఖ చెప్పింది. అమెరికా (10.81 శాతం), ఐరోపా సమాజం (7.40 శాతం), చైనా (11.37 శాతం), జపాన్ (12.85 శాతం) దేశాల ఎగుమతులు ఈ ఏడాది జనవరిలో తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) గణాంకాలు చెబుతున్నట్లు పేర్కొంది. ఇదిలావుంటే 2015-16 ఏప్రిల్-మార్చిలో దేశీయ ఎగుమతులు గతంతో పోల్చితే 15.85 శాతం పడిపోయి 310.3 బిలియన్ డాలర్ల నుంచి 261.13 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు కూడా 15.28 శాతం తగ్గి 379.6 బిలియన్ డాలర్లకు వచ్చాయి. వాణిజ్య లోటు 2014-15లో 137.69 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2015-16లో 118.45 బిలియన్ డాలర్లుగా ఉంది.
క్షీణించిన సేవల ఎగుమతులు
ముంబయి: భారత సేవల ఎగుమతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 12.6 శాతం క్షీణించి 12.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నిరుడు 14.09 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం తెలిపింది. అలాగే సేవల దిగుమతులు కూడా 8.9 శాతం పడిపోయి 7.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఫిబ్రవరిలో 7.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.