బిజినెస్

బడ్జెట్ ర్యాలీకి కలిసొచ్చిన ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ ర్యాలీని కొనసాగిస్తున్న సూచీలకు బుధవారం జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు మరింత జోష్‌నిచ్చాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 198.76 పాయింట్లు పుంజుకుని 28,439.28 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 60.10 పాయింట్లు పెరిగి 8,801.05 వద్ద నిలిచింది. రియల్టీ, బ్యాంక్స్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన హాంకాంగ్, చైనా, జపాన్ సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలో కీలకమైన సూచీలు బ్రిటన్, ఫ్రాన్స్ కూడా లాభాలను అందుకున్నాయి. జర్మనీ సూచీ మాత్రం నష్టపోయింది.