బిజినెస్

జియో ఉచిత ఆఫర్లపై వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇస్తున్న ఉచిత 4జి సేవలపై వివరణ ఇవ్వాలని టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్‌ని టెలికామ్ ట్రిబ్యునల్ టిడిశాట్ ఆదేశించింది. భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ దాఖలు చేసిన తాజా పిటిషన్ల నేపథ్యంలో పైవిధంగా స్పందించింది టెలికామ్ వివాదాల పరిష్కార, అప్పీలెట్ ట్రిబ్యునల్ టిడిశాట్. జియో వెల్‌కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ల పొడిగింపును ఎయిర్‌టెల్, ఐడియా తీవ్రంగా తప్పుబడుతున్నది తెలిసిందే. ఈ విషయంలో జియోపట్ల ట్రాయ్ పక్షపాత ధోరణిని అవలంభిస్తోందని అవి ఆరోపిస్తున్నాయి. ముందుగా చెప్పినదానికంటే ఉచిత ఆఫర్లను జియో పొడిగించినది తెలిసిందే. కాగా, జియో రాకతో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌సహా అన్ని టెలికామ్ సంస్థల ఆదాయం గణనీయంగా తగ్గిపోగా, కస్టమర్ల సంఖ్య కూడా నానాటికీ క్షీణిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ట్రాయ్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు ప్రత్యర్థి సంస్థలు న్యాయపోరాటానికి దిగాయి. ఇందులో భాగంగానే టిడిశాట్‌ను ఆశ్రయిస్తున్నాయి. గత వారం జియో ఉచిత వాయిస్ కాలింగ్, డేటా ప్లాన్‌కు ట్రాయ్ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది టిడిశాట్.
సిసిఐకి ఎయిర్‌టెల్
ఉచిత సేవలతో టెలికామ్ మార్కెట్‌లో పోటీతత్వమే లేకుండా జియో చేస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కు వెళ్లింది ఎయిర్‌టెల్. వ్యాపార రంగంలో జియో తరహా నిర్ణయాలు అస్సలు క్షేమం కాదన్న ఎయిర్‌టెల్.. ఇది నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంది.