బిజినెస్

డైరెక్టర్‌గానూ తీసేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 6: ఉద్వాసనకు గురైన టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్ర్తి.. ఆ సంస్థ డైరెక్టర్ పదవినీ కోల్పోయారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన టాటా సన్స్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో సంస్థ భాగస్వాములు మిస్ర్తి తొలగింపునకు మద్దతుగా ఓటేశారు. ‘ఈరోజు నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో టాటా సన్స్ లిమిటెడ్ భాగస్వాములు.. టాటా సన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా సైరస్ మీస్ర్తిని తొలగించాలని తీర్మానించారు. దీనికి సంపూర్ణ మద్దతును ఇచ్చారు.’ అని టాటా గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న టాటా సన్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో సోమవారం తెలిపింది. మిస్ర్తి తొలగింపు కోసం గత నెల ఈ అసాధారణ సర్వసభ్య సమావేశానికి టాటా సన్స్ పిలుపునివ్వగా, దీన్ని వ్యతిరేకిస్తూ మిస్ర్తి న్యాయపోరాటానికీ సిద్ధపడ్డారు. నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి)లో సమావేశాన్ని రద్దు చేయాలంటూ మిస్ర్తి కుటుంబం నేతృత్వంలోని రెండు ఇనె్వస్ట్‌మెంట్ సంస్థలు పిటిషన్ వేశాయి. అయితే దీన్ని ఎన్‌సిఎల్‌ఎటి తోసిపుచ్చింది.
ఫలితంగా సమావేశం నిరాటంకంగా జరగగా, మిస్ర్తి తొలగింపునకు మెజారిటీ భాగస్వాములు సమ్మతించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కు చెందిన ముంబయి బెంచ్.. జనవరి 31న మిస్ర్తి అభ్యర్థనకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో ఆయన, ఆయనకు చెందిన సంస్థలు ఎన్‌సిఎల్‌ఎటిని ఆశ్రయించారు. నిరుడు అక్టోబర్ 24న టాటా సన్స్.. తమ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తిని అనూహ్యంగా తొలగించినది తెలిసిందే. మాజీ చైర్మన్ రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్‌గా నియమించిన టాటా సన్స్.. నాలుగు నెలల్లో కొత్త చైర్మన్ ఎంపిక కోసం ఓ కమిటీని కూడా వేసింది. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌నకు టాటా సన్స్ నాయకత్వం వహిస్తోంది. గుండు పిన్ను దగ్గర్నుంచి గాల్లో ఎగిరే విమానాలదాకా అన్ని రంగాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న టాటా గ్రూప్.. దేశంలోనేగాక విదేశాల్లోనూ పారిశ్రామికంగా బలాన్ని కలిగి ఉంది. అలాంటి సంస్థను నిర్వీర్యం చేసేలా మిస్ర్తి చర్యలుంటున్నాయని టాటా సన్స్ ప్రధాన ఆరోపణ. ఇందుకు బ్రిటన్ ఉక్కు వ్యాపారం, టాటా-డొకోమో ఒప్పందాన్ని నిదర్శనంగా చూపుతోంది. వ్యాపార విస్తరణే లక్ష్యంగా సాగుతున్న టాటా గ్రూప్ ఆశయానికి మిస్ర్తి తూట్లు పొడుస్తున్నారంటూ అన్ని సంస్థల డైరెక్టర్ పదవుల నుంచి తొలగిస్తూ పోయింది. చివరకు ఇప్పుడు టాటా సన్స్ డైరెక్టర్ పదవి నుంచి తీసేసింది. ఇప్పటికే మిస్ర్తి అనుయాయులపైనా టాటాలు వేటువేసినది తెలిసిందే. అయితే మిస్ర్తి మాత్రం టాటా గ్రూప్‌లో నష్టాల్లో ఉన్న సంస్థలు.. లాభాల్లో ఉన్న సంస్థలను దెబ్బతీస్తున్నాయని, వాటి లాభాలు ఆవిరైపోయేలా చేస్తున్నాయని, అందుకే నష్టాలబారినపడ్డ సంస్థలను వదిలించుకునేలా నిర్ణయాలు తీసుకున్నానని అంటున్నారు. ఇది తప్పా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటాపై నిప్పులు చెరిగారు. టాటా గ్రూప్ సంస్థలు నష్టాల్లో నడవడానికి కారణం రతన్ టాటానే అని ఆరోపించారు. తనకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే టాటా సన్స్‌దే విజయమైంది. కాగా, సంస్థ కొత్త చైర్మన్‌గా టిసిఎస్ చీఫ్ చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఇటీవల నియమించినది తెలిసిందే. టాటా సన్స్‌లో సైరస్ మిస్ర్తి కుటుంబానికి 18.5 శాతం వాటా ఉంది.