బిజినెస్

17వ నెలా మైనస్సే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: టోకు ద్రవ్యోల్బణం ఇంకా మైనస్‌లోనే కొనసాగుతోంది. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం వరుసగా 17వ నెల రుణాత్మక ధోరణిని అవలంభిస్తూ గత నెల మార్చిలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -0.85 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది -0.91 శాతంగా ఉంది. నిరుడు మార్చిలోనైతే -2.33 శాతంగా ఉంది. కాగా, 2014 నవంబర్ నుంచి టోకు ద్రవ్యోల్బణం మైనస్‌లోనే కొనసాగుతోంది. ఇకపోతే ఈ మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 3.73 శాతంగా నమోదవగా, ఫిబ్రవరిలో 3.35 శాతంగా ఉంది. అయితే ఆహారా, కూరగాయల ధరలు రాబోయే నెలల్లో పెరిగే వీలుండటంతో దానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం గణాంకాలు మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పప్పు ధరలు భారీగా పలుకుతున్న నేపథ్యంలో వరుసగా 15వ నెల పప్పు్ధన్యాల ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో నమోదైంది. మార్చిలో 34.45 శాతంగా ఉంది. ఇది నిరుడు జనవరి (12.56 శాతం) నుంచి క్రమేణా పెరుగుతోంది.