బిజినెస్

జనవరిలో పెరిగిన జెఎల్‌ఆర్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్.. జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల జనవరిలో 4 శాతం పెరిగాయి. ఈ జనవరిలో 47,693 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. జాగ్వార్ ఎఫ్-పేస్, ఎక్స్‌ఎఫ్, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లకు మార్కెట్‌లో విశేష ఆదరణ లభించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో జెఎల్‌ఆర్ వివరించింది. కాగా, అమ్మకాల్లో జాగ్వార్ కార్లు 13,949 యూనిట్లుగా, లాండ్ రోవర్ కార్లు 33,744 యూనిట్లుగా ఉన్నాయి.