బిజినెస్

నాలుగు వేల హెక్టార్లలో కాఫీ సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 9: ప్రపంచ మార్కెట్‌లోకి ఎక్కుతున్న అరకుకాఫీ ఇక నుంచి అరకు కాఫీ బ్రాండ్‌తో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌తోపాటు పలు దేశాల్లో కాఫీ పంటకు పేరుండగా, ఇక నుంచి భారతదేశంలో విశాఖ జిల్లా అరకు కాఫీ ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో గిరిజన సహకార సంస్థ (జిసిసి) లక్ష్యాలను అధిగమించనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి నాలుగు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పంట సేకరణ సంస్థ లక్ష్యం పెట్టుకుంది. భారతదేశంలో పశ్చిమ కనుమల ప్రాంతం కాఫీ తోటల పెంపకంలో గత శతాబ్దం కాలంలో బాగా అభివృద్ధి చెందితే, తూర్పు కనుమల ప్రాంతం కాఫీ పంటలో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇందులో ఆంధ్ర రాష్ట్రం విశాఖ జిల్లా అరకు ప్రాంతం అత్యంత అందమైన ప్రాంతమేకాకుండా సహజసిద్ధమైన సౌందర్యానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. అటువంటి ఈ ప్రాంతంలో ఐటిడిఏ, జిసిసి సంయుక్త ఆధ్వర్యంలో పదేళ్ళ ప్రాజెక్టు కింద చేపట్టిన అరకు కాఫీ పంట నాలుగు వేల హెక్టార్లకు విస్తరించబడింది. దీనిని మరింతగా పెంచుతూ ఐదు వేల హెక్టార్లకు విస్తరిస్తే ప్రపంచ దేశాల్లో తక్కువుగా అమ్ముడుపోయే ప్రాంతాలకు దీనిని ఎగుమతి చేయవచ్చని జిసిసి భావిస్తోంది. గత ఏడాది తొలిసారిగా రెండు వేల మెట్రిక్ టన్నుల మేర అరకు కాఫీ పంటను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 1500 మెట్రిక్ టన్నులు అధిగమించగలిగింది. ఈసారి దీనిని పూర్తిచేస్తూ రెట్టింపులో కాఫీ పంటను ఎగుమతి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల గిరిజన రైతులకు లాభసాటిగా ఉండటంతోపాటు దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించినట్టు అవుతుంది సంస్థ వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, దళారీల జోక్యంతో గత కొనే్నళ్ళుగా తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులు ఇపుడు నిర్వహిస్తున్న పదేళ్ళ ప్రాజెక్టులో భాగంగా 50 నుంచి 60 శాతం మేర ప్రయోజనం పొందగలుగుతున్నారు. కాఫీకి గిట్టుబాటు ధర లభించడంతోపాటు, ఒక్కో గిరిజన సభ్యుడు కనీసం 15వేల నుంచి 40వేల రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు. గతంలో ఏపుడూ లేని ఇటువంటి పరిస్థితులు ఈమధ్యకాలంలోనే అనుకూలిస్తున్నాయని గిరిజన రైతులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. విశాఖ జిల్లా 11 ఏజెన్సీ మండలాల్లోను కాఫీ పంటను పండిస్తుండగా, కనీసం లక్ష మంది గిరిజన రైతులను సభ్యులుగా చేరుకుని వీరంతా పండించే కాఫీ పంటను సేకరించి దేశ, విదేశాలకు పంపించడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టతను మరింతగా ఇనుమడింపచేయాలనేది ప్రధాన లక్ష్యంగా జిసిసి చెబుతోంది. లబ్ధి పొందుతున్న గిరిజన రైతుల సంఖ్యను అనూహ్యంగా పెంచాలని నిర్ణయించింది. కాగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1969లో విశాఖ జిల్లాలో రిజర్వు అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాల్లో అభివృద్ధి చేయగా దీనిని 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఈ విధంగా 1956లో గిరిజన సహకార సంస్థ ఏర్పడగా, కాఫీ బోర్డు దీనిని కాఫీ తోటల అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విధంగా గుర్తింపబడి గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభమైంది. 1975 నుంచి 1985 వరకు జిసిసిలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం పనిచేస్తూ సుమారు నాలుగు వేల హెక్టార్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలైంది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనులతో అరుకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకు కాఫీ’గా పేరు స్థిరపడింది. 1985 తరువాత జిసిసి ఆధ్వర్యంలో అరకు కాఫీ అభివృద్ధికి గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్థ (గిరిజన కో-ఆపరేటివ్ ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్) స్థాపించబడింది. ఈ విధంగా జిసిసి ద్వారా, జిసిపిడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతులకు ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు వంతున పంపిణీ చేయడం జరిగింది. 1997 జూలైన జిసిపిడిసి సంస్థ కార్యకలాపాలను సిబ్బందితోపాటు ఐటిడిఏలో విలీనం చేసి కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళికాబద్ధంగా నిర్వహించి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) నిధుల సహాయంతో లక్ష ఎకరాలకు చేరి, కాఫీ తోటల గిరిజన రైతుల ద్వారా సాగు చేయబడుతున్నాయి. ఈ క్రమంలో గడచిని అర్ధ శతాబ్ది కంటే రెండేళ్ళ వ్యవధిలో గిరిజన రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న జిసిసి ఇక నుంచి లక్ష్యాలను అధిగమించాలని నిర్ణయించింది.