బిజినెస్

ఇన్ఫీలో ముదురుతున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్ కాంపెనే్సషన్, కార్పొరేట్ గవర్నెన్స్‌లపై సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి లేవనెత్తిన ప్రశ్నలతో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, దాని బోర్డు మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్‌లో సిఇఒ విశాల్ సిక్కా వేతనం పెంపు వివాదాస్పదమైంది. ఒక్కసారిగా సిక్కా వేతనం భారీగా పెరగడం సంస్థ ప్రమోటర్లకు నచ్చడం లేదు. మరోవైపు ఇన్ఫోసిస్ వ్యవహారంలో జోక్యం చేసుకోబోవడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.