రాష్ట్రీయం

ఆధునిక హంగులతో కాజీపేట జంక్షన్‌ను అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి (వరంగల్), ఫిబ్రవరి 10: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో కాజీపేట రైల్వే జంక్షన్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు.
కాజీపేట రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తనిఖీ చేయడా నికి ఆయన శుక్రవారం ప్రత్యేక రైలులో అధికారులతో కలిసి విచ్చేశారు. పనులను పరిశీలించిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాలంలో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ప్లాట్‌ఫారాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రిడ్జీలు, స్టేషన్లలో ప్రయాణికులకు సంబంధించి వౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. రైల్వే బడ్జెట్ నిధులతో 2019కల్లా వ్యాగన్ షెడ్ పూర్తి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కాగా, కాజీపేట, వరంగల్, ఖమ్మంలోని రైల్వే లైన్ పనులు, స్టేషన్ల అధునీకరణ పనులను ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో పూర్తి చేస్తామన్నారు.
సమస్యలపై జిఎంకు వినతులు
కాగా, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌లు కాజీపేట వరంగల్ స్టేషన్లలోని సమస్యలను పరిష్కరించాలని, రైల్వే ఆసుపత్రిలోని డాక్టర్లు, సిబ్బంది కొరతను తీర్చాలని, అధునీకరణ పనులు వేగవంతం చేయాలని వినతి పత్రం అందజేశారు. అదే విధంగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, బిజెపి అర్బన్ పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్యదర్శి రవీందర్‌లు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా జిఎం మాట్లాడుతూ అందరూ ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి, అంశాల వారీగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కాజీపేట జంక్షన్‌ను సందర్శించిన అధికారుల్లో సిపిఒ రమణారెడ్డి, సిఒఎం జీవన్‌రెడ్డి, సిఎంఇ అభిలాష్, డిఆర్‌ఎం అగర్వాల్, కాజీపేట, సికింద్రాబాద్ స్టేషన్ల అధికారులున్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్ యాదవ్