బిజినెస్

పవర్ గ్రిడ్ లాభం రూ. 1,930 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రభుత్వ విద్యుత్‌రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 1,930.02 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో సంస్థ లాభం 1,606.25 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 20 శాతం పెరిగినట్లైంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు పవర్ గ్రిడ్ తెలియజేసింది. ఆదాయం ఈసారి 6,787.51 కోట్ల రూపాయలుగా, పోయినసారి 5,476.37 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో 50 శాతం పవర్ గ్రిడ్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ ద్వారానే ట్రాన్స్‌మిట్ అవుతోంది. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థ.