బిజినెస్

మహీంద్ర లాభం రూ. 1,112 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 10: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర పన్నుల అనంతర స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో నిరుడుతో పోల్చితే 33.29 శాతం పెరిగి 1,112.27 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 834.47 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మహీంద్ర తెలిపింది. ఆదాయం ఈసారి 11,777.98 కోట్ల రూపాయలుగా, నిరుడు 11,607.35 కోట్ల రూపాయలుగా ఉంది. సంస్థ వాహన అమ్మకాలు ఈ అక్టోబర్-డిసెంబర్‌లో 1,12,852 యూనిట్లుగా ఉన్నాయి. ఆటోమోటివ్ ఆదాయం 7 శాతం క్షీణించగా, ఫామ్ ఎక్విప్‌మెంట్ ఆదాయం 20 శాతం ఎగిసింది. పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆటో అమ్మకాలపై కనిపించిందని సంస్థ తెలిపింది.