బిజినెస్

జూన్‌కల్లా ఆధార్ ఆధారిత రేషన్ షాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ఆధ్వర్యంలోని అన్ని చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు)ను ఈ ఏడాది జూన్‌కల్లా ఆధార్ అనుసంధానంతో ఏకం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం తెలిపారు. 5.58 లక్షల రేషన్ షాపులను ఆధార్ ఆధారంగా అనుసంధానం చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఆహార, వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల పేదలకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయన్నారు.