బిజినెస్

కోల్ ఇండియా లాభం రూ. 2,884 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పాదక సంస్థ కోల్ ఇండియా ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 22 శాతం క్షీణించి 2,884.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,718 కోట్ల రూపాయలుగా ఉంది. సంస్థ ఆదాయం ఈసారి 21,531.2 కోట్ల రూపాయలుగా ఉందని, పోయినసారి 20,928.4 కోట్ల రూపాయలుగా ఉందని శనివారం కోల్ ఇండియా తెలియజేసింది. నికర అమ్మకాలు నిరుడుతో పోల్చితే 18,971.5 కోట్ల రూపాయల నుంచి 19,704 కోట్ల రూపాయలకు పెరిగాయి.