బిజినెస్

కృష్ణా-గోదావరి బేసిన్‌లో గ్యాస్ పైపులైను పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 19: కృష్ణా గోదావరి (కెజి) బేసిన్ పరిధిలో 617 కిలోమీటర్ల గ్యాస్ పైపులైను పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) జిఎం ఎంవి అయ్యర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పైపులైను పునరుద్ధరణ పనులు రెండు దశలుగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా ఇవి పూర్తికానున్నాయన్నారు. భద్రతాపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. కెజి బేసిన్ పరిధిలో 515 కోట్ల రూపాయలతో 180 కిలోమీటర్ల పైపులైను పునరుద్ధరణ జరుగుతోందని, ఇప్పటి వరకూ 419 కోట్ల రూపాయలతో ప్రధాన పైపులైను పునరుద్ధరణ జరిగిందన్నారు. రెండవ దశలో 183 కిలోమీటర్ల మేర పైపులైను పునరుద్ధరణ 515 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం కెజి బేసిన్ పరిధిలో 933 కిలోమీటర్లు పైపులైను ఉందన్నారు. రోజుకు 5.2 ఎంఎంఎస్ గ్యాస్‌ను ఎన్‌ఎఫ్‌సిఎల్, జివికె, ల్యాంకో, ఎడి జిపిసిఎల్ వంటి సంస్థలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. 365 కిలోమీటర్ల మేర పైపులైను పర్యవేక్షణ పూర్తయిందన్నారు. మరో 232 కిలోమీటర్ల పైపులైను పరిశీలన పూర్తిచేయవలసి ఉందన్నారు. మోరి, పాశర్లపూడి, నరసాపురం, మండపేట, గోపవరంలో గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. అంతేగాక కేశనపల్లి (వెస్ట్), ఇనమూరు, తాటిపాకలలో డీహైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. నగరం పైపులైను విస్పోటన ఘటనపై మూడు రకాల విచారణలు చేస్తున్నామని, ఇందులో శాఖాపరంగా చేస్తున్న విచారణలో సంఘటన జరిగినప్పుడు ఉన్న జిఎం, మరికొంత మంది అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ విచారణలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. నగరం ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేశామని, ఇంకా ఎవరికైనా ఇవ్వవలసి ఉంటే అటువంటి వారందరికీ పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. గెయిల్ సంస్థ సామాజిక బాధ్యతగా అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ ఏడాది 9 కోట్ల రూపాయలతో సిఎస్‌ఆర్ పనులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వైద్య, విద్య సేవలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వౌలిక వసతుల కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, రక్షిత మంచినీటి సరఫరా వంటి పనులు సిఎస్‌ఆర్ నిధులతో నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో జ్యోతికుమార్, డిజిఎంఎల్ ఆర్ముగం, ఆపరేషన్స్ డిజిఎం కెవిఎస్ రావు, ప్రాజెక్ట్సు డిజిఎం జెపి సింగ్ పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంవి అయ్యర్