బిజినెస్

ఆక్వా సాగుకు అండగా నిలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 11: బ్రాండ్ ఇండియాగా పేరొందిన భీమవరం రొయ్యకు విదేశాల్లో మరింత డిమాండ్ పెరిగింది. ఇక నుంచి కాలుష్య రహితంగా రొయ్యను పండించేలా అడుగులు పడుతు న్నాయ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ‘ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్’ అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. చైనా, థాయ్‌లాండ్, మలేషియా, తైవాన్, వియత్నాం, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను శాస్తవ్రేత్తలు ఆవిష్కరించగా, అనంతరం జరిగిన సభను మంత్రి కామినేని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1974 ప్రాంతంలో కొల్లేరు రైతుల జీవన స్థితిగతులను మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించిందన్నారు. అదే చేప, రొయ్య.. నేడు రాష్ట్రంతోపాటు దేశ కీర్తి ప్రతిష్ఠలనే పెంచిందన్నారు. విదేశాలకు ఎగుమతి అవుతున్న దేశీయ ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆక్వా రైతాంగానికి అండగా ఉంటాయన్నారు. కొల్లేరు ప్రాంత రైతాంగం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు డి-పట్టా, జిరాయితీ భూముల విషయంలో కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి అనీల్ దవేని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో కలుస్తామన్నారు. ఆక్వా రంగం వల్ల తాగునీరు, పర్యావరణానికి హాని కలుగుతోందని కొంతమంది విమర్శలు చేస్తున్నారని, వారి అనుమానాలను నివృత్తి చేయాలని రాష్ట్ర మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్ కావాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.5 బిలియన్ టన్నులు ఉన్న మత్య్స ఉత్పత్తులు రానున్న పదేళ్ళలో 10 బిలియన్ టన్నులు చెయ్యాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనివల్ల వృద్ధిరేటు కూడా బాగా పెరుగుతుందని చెప్పారు. సదస్సులో మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, ఎఐటి ప్రొఫెసర్ సలీం, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ డాక్టర్ ఎస్ కృష్ణయ్య, ఎస్‌బిఐ డిజిఎం దీప్‌చంద్, కేరళ మత్య్స విశ్వవిద్యాలయం మాజీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ సి మన్మోహన్ కుమారన్ నాయర్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి వెంకట శివరామరాజు పాల్గొన్నారు.

చిత్రం..మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్