బిజినెస్

వడ్డీరేట్లు తగ్గుతాయనుకున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఇటీవలి ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందని అనుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయినప్పటికీ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్‌బి ఐ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. శనివారం ఇక్కడ పోస్ట్ బడ్జెట్ కస్టమరీ బోర్డు మీటింగ్‌లో మాట్లాడుతూ ‘ఆర్థిక మంత్రులంతా ద్రవ్యసమీక్షకు ముందు వడ్డీరేట్లు తగ్గుతాయనే ఆశిస్తారు. కానీ చివరకు ఆర్‌బిఐ నిర్ణయమేదైనా దానే్న అంతా గౌరవిస్తాం.’ అని అన్నారు.
కాగా, ఓ నిపుణత కలిగిన సంస్థగా దేశ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ల అవసరాలను సెబీ గుర్తిస్తుందని అన్నారు. ఆర్‌బిఐతో చర్చల తర్వాత ఎలక్టోరల్ బాండ్లపై మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు. ఇదిలావుంటే బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తాయన్న ఆశాభావాన్ని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ మందగమన పరిస్థితుల్లో క్రెడిట్ డిమాండ్‌ను పెంచేందుకు రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకర్లు తగ్గిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి కొత్త చీఫ్‌గా ఎన్నికైన అజయ్ త్యాగీ మాట్లాడుతూ సెబీది ఓ పెద్ద బాధ్యతే అన్నారు. 5,600 కోట్ల రూపాయల నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఇఎల్) కుంభకోణం కేసులో కఠిన చర్యలు తీసుకోవడానికి సెబీ వెనుకాడబోదని అన్నారు. ఎన్‌ఎస్‌ఇ కో-లొకేషన్ కేసులోనూ చర్యలకు సెబీ సమాయత్తమవుతోందన్నారు. పి-నోట్ ఆందోళనల పరిష్కారానికి అవసరమైన చర్యలను సెబీ చేపడుతోందన్న ఆయన కమాడిటీస్ డెరివేటివ్స్ మార్కెట్‌లో సంస్కరణలకు కట్టుబడి ఉన్నామన్నారు. స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల గవర్నింగ్ నిబంధనలను సవరిస్తామని, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) తర్వాత స్టాక్ మార్కెట్‌లో సంస్థల లిస్టింగ్ సమయాన్ని ఇప్పుడున్నదానికంటే మరింతగా తగ్గిస్తామని చెప్పారు.