బిజినెస్

పరోక్ష పన్నులను తక్షణమే తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పరోక్ష పన్నులను తక్షణమే తగ్గించాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం.. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మందగమనంలోకి వెళ్లిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇది చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను దిశా-నిర్దేశం లేని, లక్ష్యం లేని బడ్జెట్‌గా చిదంబరం అభివర్ణించినది తెలిసిందే. ఈ క్రమంలో పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసిందని, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధిరేటుకు భంగం కలిగించిందని అన్నారు. ఈ ప్రభావం వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల వృద్ధిరేటుపైనా ఉంటుందనే ఆందోళనను కనబరిచారు. అందుకే అలాంటి ప్రమాదం లేకుండా పరోక్ష పన్నులను వెంటనే తగ్గించాలని జైట్లీకి ఆయన ఈ సందర్భంగా సూచించారు. నిజానికి కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడానికి బడ్జెట్ రూపంలో ఓ అవకాశం వచ్చిందని, దాన్ని జైట్లీ చేజార్చుకున్నారన్న ఆయన పరోక్ష పన్నులను 4-8 శాతం తగ్గించగల వీలు జైట్లీకి ఉందని, ఇప్పటికైనా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలన్నారు.