బిజినెస్

ఆక్వా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 12: దేశంలోని ఆక్వా రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనుకూలమని దేశ, విదేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక్కడి వనరులను సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచ ఆక్వారంగంలోనే భారత్ ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న ప్రాఫిట్ ఆన్ ఆక్వాకల్చర్ అంతర్జాతీయ సదస్సులో భాగంగా రెండవ రోజు ఆదివారం సాంకేతిక సదస్సును నిర్వహించారు. ఆనంద గ్రూప్, ఎఐటి (్థయిలాండ్), ఎపి మత్య్సశాఖ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సదస్సులో థాయిలాండ్, మలేషియా, తైవాన్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు, నిపుణులు ఆయా దేశాల్లో జరుగుతున్న ఆక్వాసాగును వివరించారు. వరల్డ్ ఫుడ్ అవార్డు గ్రహీత, భారత శాస్తవ్రేత్త డాక్టర్ ఎం విజయ్ గుప్తా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 580 రకాల చేపలను ఉత్పత్తి చేస్తుంటే వీటిలో ఒక్క చైనానే 250 రకాలను ఉత్పత్తి చేసి ప్రపంచ ఆక్వా రంగంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. 20 ఏళ్ళ క్రితం కేవలం సముద్రం ఆధారంగా 5 మిలియన్ టన్నుల చేపలను ఉత్పత్తి చేసేవారని, ప్రస్తుతం వివిధ రూపాల్లో 73 మిలియన్ టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తున్నారని గుప్తా తెలిపారు. చైనా వంటి దేశాల్లో సగటున ఒక్కరు ఏడాదికి 50 కిలోల చేపలను ఆహారంగా తీసుకుంటుంటే, భారత్‌లో కేవలం 9 కిలోలు మాత్రమే తీసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 4 కిలోలకే పరిమితమయ్యారన్నారు. శాస్తవ్రేత్తలు చేపలు, రొయ్యలు, సముద్ర ఉత్పత్తులను పండించే రైతుల వద్దకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఆక్వా రంగంలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించవచ్చునన్నారు. చైనాలో ఈ విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేయడంవల్లే ఆ దేశం అన్ని రంగాల్లో రాణిస్తోందన్నారు.
మలేషియాకి శాస్తవ్రేత్త నయన్‌తా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆక్వారంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో యాంటిబయోటిక్స్‌కు దూరంగా రైతాంగం ఉండకపోతే రానున్న పదేళ్లలో చేపలు, రొయ్యలు కనపడవని హెచ్చరించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా సాగు చేస్తున్న 35 వేల మంది రైతుల నుంచి 19 మంది ఉత్తమ రైతులను ఎంపికచేసి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు.

చిత్రం..ఉత్తమ ఆక్వా రైతును సత్కరిస్తున్న ప్రభుత్వ, మత్స్య శాఖ అధికారులు