బిజినెస్

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 17.37 పాయింట్లు పెరిగి 28,351.62 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11.50 పాయింట్లు అందుకుని 8,805.05 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభంలో చెప్పుకోదగ్గ లాభాలతోనే నడిచిన సూచీలు.. ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల వైపు నడిచాయి. అయితే ఐటి, మెటల్, విద్యుత్ రంగాల షేర్లకు చివర్లో లభించిన కొనుగోళ్ల మద్దతు కారణంగా తిరిగి సూచీలు స్వల్ప లాభాలనైనా అందుకున్నాయి. కాగా, గత శుక్రవారం విడుదలైన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు మైనస్‌లోకి వెళ్లడం మదుపరులను కలవరపరిచిందని, అందుకే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారని మార్కెట్ వర్గాలు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నాయి. ఇక ఆసియా మార్కెట్లలో కీలకమైన చైనా, హాంకాంగ్, జపాన్ సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలో ప్రధానమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా లాభాల్లోనే కదలాడాయి.