బిజినెస్

ట్విట్టర్ వేదికగా టెలికామ్ సంస్థల లవ్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రపంచ ప్రేమికుల రోజున భారతీయ టెలికామ్ రంగంలో ప్రేమ వెల్లివిరిసింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, ఎయిర్‌సెల్ మధ్య సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర లవ్ గేమ్ సాగింది మరి. పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా మంగళవారం ఈ లవ్ గేమ్‌ను రిలయన్స్ జియో మొదలు పెట్టగా, టెలికామ్ రంగంలో తన ప్రధాన ప్రత్యర్థులైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలను విష్ చేసింది.
‘డియర్ ఎయిర్‌టెల్ ఇండియా, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్.. హ్యాపీ వాలెంటైన్స్ డే- ప్రేమతో జియో.’ అని ట్విట్ చేసింది రిలయన్స్ జియో. ఆరు గంటల వ్యవధిలో ఇలా 3 వేలకుపైగా ట్వీట్లు చేయగా, 4 వేల లైక్‌లు వచ్చాయి.
ఎయిర్‌టెల్ ఆలస్యం చేయకుండా ‘సేమ్ ఫీల్స్.. రిలయన్స్ జియో. అందరి తర్వాత ‘హర్ ఎక్ ఫ్రెండ్ జరూరీ హోతా హై??’’ అంటూ ట్వీట్ చేసింది. వొడాఫోన్, ఐడియాలతోనూ చాటింగ్ చేసింది.
మరోవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ‘రిలయన్స్ జియో.. సేమ్ టు యు. నేడు ఇలా ప్రేమ వికసించడం బాగుంది తెలుసా?’ అని ఐడియా ట్వీటింది. ఎయిర్‌టెల్ ఇండియా, వొడాఫోన్‌లతోనూ ముచ్చటించింది.
ఈ అవకాశాన్ని వదులుకోని ఎయిర్‌సెల్ కూడా తనదైన రీతిలో స్పందించింది. ‘సర్‌జీ, కోట్లాది మంది జీవితాల్లో ఏదోవిధంగా, ఎక్కడోచోట ఓ చిన్నపాటి మార్పును తీసుకురాగలిగాం. ‘టుగెదర్ కనెక్టింగ్ హార్ట్స్.. ఐడియా సెల్యులార్’’ అంటూ ఐడియాకు ఎయిర్‌సెల్ ట్వీట్ ఇచ్చింది.
దీనికి ఐడియా రోజా పూలతో స్పందించకపోయినా.. ఓ చక్కని మాటతో బదులిచ్చింది. ‘వంద కోట్లకుపైగా భారతీయుల ప్రేమ కోసం ఓ చిన్ని ప్రయత్నమిది.’ అంటూ ఎయిర్‌సెల్‌కు ట్వీట్ చేసింది.
వ్యాపార రంగంలో ఎంతటి విభేదాలున్నా, వ్యతిరేకతలున్నా.. నిజ జీవితంలో మాత్రం అంతా కావాల్సినవారమేనన్న సంకేతాలను ఈ ట్విట్టర్ సంభాషణలతో ప్రేమికుల రోజున టెలికామ్ సంస్థలు ఇచ్చినట్లైంది. ఉచిత 4జి సేవలతో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ ఆదాయానికి జియో భారీగా గండి కొట్టినది తెలిసిందే. జియో ఆఫర్ల దెబ్బకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా లాభాలు పడిపోగా, ఐడియా సెల్యులార్ ఏకంగా నష్టాల పాలైంది. జియో ప్రకటిస్తున్న ఫ్రీ ఆఫర్లపై ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలు న్యాయపోరాటం కూడా చేస్తున్నాయి. పరస్పర విమర్శలూ చేసుకుంటున్నాయి. అయనప్పటికీ వాలెంటైన్స్ డే వీటన్నిటికీ ఓ చిన్న విరామం ఇచ్చిందనిపిస్తోంది కదూ..