బిజినెస్

30 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు టోకు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. గత నెలలో ఏకంగా 30 నెలల గరిష్ఠాన్ని టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) తాకింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 5.25 శాతంగా నమోదైంది. 2014 జూలైలో 5.41 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయ దరిదాపుల్లోకి చేరింది. కాగా, సోమవారం వెల్లడైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మూడేళ్ల కనిష్టానికి దిగజారితే, టోకు ధరలు మాత్రం తాజాగా రెండున్నరేళ్ల గరిష్ఠాన్ని చేరడం గమనార్హం. నిరుడు డిసెంబర్‌లో ఇది 3.39 శాతంగా, నవంబర్‌లో 3.38 శాతంగా ఉంది. నిజానికి పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జనవరిలో కూడా టోకు ధరల సూచీ అదుపులోనే ఉంటుందనే అంచనాలున్నాయి. కానీ అంచనాలు తారుమారయ్యాయ. పెట్రోల్, డీజిల్ ధరల్లో చోటుచేసుకున్న భారీ పెరుగుదల కారణంగా టోకు ధరలు కూడా అలాగే పెరిగాయ. జనవరిలో పెట్రోల్ ధరలు 31.10 శాతం, డీజిల్ ధరలు 15.66 శాతం మేర పెరిగినట్లు తేలింది. కాగా, ఉల్లిగడ్డ, బంగాళదుంప, పప్పు్ధన్యాల ధరలు తక్కువగానే ఉన్నాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు మాత్రం 3.59 శాతం ఎగిశాయి. మరోవైపు పెరిగిన టోకు ద్రవ్యోల్బణం నేపథ్యంలో వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించాలని, బ్యాంకులు కూడా రుణా లపై వడ్డీరేట్లను తగ్గించేలా కేంద్ర ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని వ్యాపార, పారిశ్రామిక రంగాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయ.