బిజినెస్

ఇక నిమిషాల్లో ‘పాన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: శాశ్వత ఖాతా నంబరు (పాన్) కావాలంటే ఇంతకు ముందు వారాలు పట్టేది. అయితే ఇప్పుడు ఇక దరఖాస్తు చేసిన కొద్ది నిమిషాల్లోనే పాన్ మీ చేతికి వస్తుంది. అంతేకాదు పన్ను చెల్లింపుదారులు తమ స్మార్ట్ఫోన్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా ఆదాయ పన్ను శాఖ రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా ఇ-కెవైసి ధ్రువీకరణను ఎలా జరుపుతారో అలాగే పాన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఆలోచన ప్రాథమిక దశలో ఉందని, దీంతో పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించడంతోపాటుగా పాన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత పైలట్ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుందని బుధవారం ఓ అధికారి చెప్పారు. బయో మెట్రిక్ విధానం ద్వారా బొటన వేలి గుర్తుతో పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న అయిదారు నిమిషాల్లో పాన్ నంబరు వస్తుందని, ఆ తర్వాత పాన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. మరోవైపు ఈ జనవరి 1 నుంచి ఆదాయ పన్ను శాఖ కొత్తగా డిజైన్ చేసిన పాన్ కార్డులను జారీ చేయడం ప్రారంభించింది.