బిజినెస్

‘లాభదాయక ప్రభుత్వ సంస్థలన్నీ లిస్టింగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గడచిన ఎనిమిదేళ్లలో కేవలం ఆరు ప్రభుత్వరంగ సంస్థలే స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించడంతో రాబోయే 2-3 ఏళ్లలో లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వరంగ సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఓ నిర్ణయానికొచ్చింది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు బుధవారం డిఐపిఎఎమ్ కార్యదర్శి నీరజ్ గుప్తా పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2009-2016 మధ్య ఎన్‌హెచ్‌పిసి, ఇండియన్ ఆయిల్, ఎస్‌జెవిఎన్‌ఎల్, ఎమ్‌ఒఐఎల్, కోల్ ఇండియా, ఎన్‌బిసిసి సంస్థలు మాత్రమే లిస్టయ్యాయి.