బిజినెస్

పుణ్యక్షేత్రాలకు జిసిసి కుంకుమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: నాణ్యమైన, ఛాయ కలిగి ఎటువంటి రసాయనాలు కలపని కుంకుమను గిరిజన సహకార సంస్థ ఉత్పత్తి చేస్తోంది. సహజసిద్ధపైన ఈ కుంకుమను ఆర్డర్లపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు అందజేస్తోంది. దీంతో ఇప్పటి వరకు మార్కెట్లలో, షాపింగ్ మాల్స్‌ల్లో విక్రయించే నాణ్యత కొరవడిన కుంకుమకు ఉండే డిమాండ్ కాస్త పడిపోయింది. తొలిసారిగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ‘జిసిసి కుంకుమ’కు విశేషంగా ఆదరణ లభించడంతో ఇపుడు దీనిని పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి తీసుకురావాలని నిర్ణయించిన జిసిసి అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించింది. మంచి కుంకుమ తయారీకి ఏజెన్సీ రైతులు పండించే పసుపు కొమ్ములే ముడిసరకుగా ఉపయోగిస్తారు. ఇందులో శ్రేష్టమైన, నాణ్యతతోకూడిన పసుపు కొమ్ములను వారి నుంచి సేకరించి గ్రేడ్లుగా విభజించాక విశాఖ జిల్లా వడ్డాది మాడుగులలోని జిసిసి పరిశ్రమలో కుంకుమ తయారు చేస్తారు. అక్కడ ప్యాకేజీలుగా సిద్ధం చేసి, జిసిసి బ్రాండ్‌తో కూడి న కుంకుమను రాష్ట్రంలోని ఆయా పుణ్యక్షేత్రాలకు పంపిస్తారు. అయితే తొలి ప్రయోగంలోనే శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి భారీ ఆర్డర్ జిసిసికి లభించింది. దీంతో కుంకుమ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన జిసిసి ప్రతి నెలా ఇక్కడి నుంచి శ్రీశైలానికి ఐదు క్వింటాళ్ళ కుంకుమను ఎగుమతి చేస్తుంది. అలాగే మహానంది పుణ్యక్షేత్రానికి కుంకుమను సరఫరా చేయబోతోంది. సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కొంత వరకు కుంకుమ పంపిస్తుండగా, ఇదే తరహాలో మరికొన్ని పుణ్యక్షేత్రాలకు దీనిని సరఫరా చేయగలుగుతోంది. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి కుంకుమ సరఫరా చేయాలని జిసిసి నిర్ణయించింది. అయితే అందుకు తగ్గ నిబంధనలు, సరఫరా చేయగలిగే సామర్థ్యాన్ని కూడా జిసిసి సమకూర్చుకోవలసి ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానానికి ప్రతినెలా 5 క్వింటాళ్ళ మేర కుంకుమను జిసిసి బ్రాండ్‌తో అందివ్వగలుగుతుంది. కిలో కుంకుమ రూ.200లకు విక్రయిస్తుండగా, ఐదు క్వింటాళ్ళకు లక్ష రూపాయల మేర ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఏడాది మొత్తం మీద రూ.12 లక్షల వరకు రాబట్టవచ్చని భావిస్తున్న జిసిసి ఈ విధంగా పంపే కుంకుమ శాతాన్ని ఇంకా పెంచాలని ఆలోచన చేస్తుంది.
మహానందికి ఐదు క్వింటాళ్ళ మేర పంపుతుండగా, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలకు తొలి దశలో కొన్ని క్వింటాళ్ళ కుంకుమ వెళ్తున్నట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు. అన్నవరం, తిరుపతితోపాటు సాధారణ మార్కెట్లలోనూ విక్రయించాలని ఆలోచన చేస్తుంది. దశలవారీగా జిసిసి కుంకుమను దేశీయమార్కెట్‌లోకి తీసుకువస్తే అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చినట్టు అవుతుందిన సంస్థ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో నాణ్యమైన కుంకుమ తయారీపై సంస్థ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.