బిజినెస్

ఇస్రో విజయంలో ఎల్‌అండ్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను రోదసీలోకి విజయవంతంగా పంపడం వెనుక ఎల్ అండ్ టి ఏరోస్పేస్ విభాగం కూడా కీలక పాత్ర పోషించింది. తమ సంస్థలో భాగంగా ఉన్న ఏరోస్పేస్ విభాగం ఈ ప్రయోగంలో కీలక సేవలను అందించిందని ఎల్‌అండ్‌టి సంస్థ స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా ఇస్రో సాధించిన ఘనవిజయంలో తాము కూడా పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది. ఏకకాలంలో 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపిన ఏకైక దేశంగా భారత్ సాధించిన ఘనత తమ సంస్థకూ ఎంతో పేరు తెచ్చిందని ఎల్ అండ్ టి ఒక ప్రకటనలో తెలిపింది. పిఎస్‌ఎల్‌వి-సి37 రాకెట్‌లో ఉపయోగించిన ఎస్-139 మోటార్ కాస్టింగ్‌లను తామే ఉత్పత్తి చేశామని ఎల్ అంట్ టి వివరించింది. అలాగే హనీకామ్ డెక్ ప్యానల్స్‌ను కూడా తామే తయారుచేసినట్లు వెల్లడించింది. అలాగే ఇతర కీలక భాగాలను తామే ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. భారత్‌కు చెందిన బహుళ జాతి సంస్థగా ఖ్యాతి నార్జించిన ఎల్ అంట్ టి టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర నిర్మాణ రంగాల్లో క్రియాశీలకంగా ఉంది. దాదాపు 16బిలియన్ డాలర్ల రెవెన్యూతో వీటితోపాటు ఆర్థిక సేవలను కూడా అందిస్తోంది.