బిజినెస్

నగదు ఇక్కట్లు తీరాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 16: రద్దయిన నోట్ల పునరుద్ధరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నగదు లభ్యతకు సంబంధించి మామూలు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దైనందిన వారీగా నగదు లభ్య అంశాన్ని రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. జార్ఖండ్ గ్లోబల్ ఇనె్వస్టర్ల సదస్సుకు హాజరైన జైట్లీ విలేఖరులతో మాట్లాడారు. నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థలో అనేక లోపాలున్నాయని, ముఖ్యంగా నేరాలకు, పన్నుల ఎగవేతకు ఇది కారణమవుతోందని తెలిపారు. దీని దృష్ట్యా దేశంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ తీరులో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రద్దయిన పెద్దనోట్లలో ఎంతమొత్తం బ్యాంకులకు తిరిగి వచ్చిందన్న ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇప్పటికే ఇందుకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించారు. మొత్తం కరెన్సీ నిర్ధారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎంతమొత్తం వెనక్కు వచ్చిందన్న విషయాన్ని వెల్లడించలేమని ఆయన స్పష్టం చేసిన విషయాన్ని జైట్లీ గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి ఎంత సమయం తీసుకోవాలో అంతే సమయాన్ని ఆర్బీఐ తీసుకుంటుందని, దీనిపై తాను ఇంతకన్నా చెప్పేదేమీ లేదని అన్నారు. అలాయే ఖనిజాలకు సంబంధించి రాయిల్టీ చెల్లింపులపై వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలను తిరస్కరించారు. నియమ నిబంధనల ప్రకారమే రాయల్టీ చెల్లిస్తున్నామని, ఈ విషయంలో ఎలాంటి వివక్షకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.