బిజినెస్

ధాన్యం డబ్బులివ్వండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 20: రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో సమస్యాత్మకంగా మారా య. ధాన్యం కొనుగోలు సజావుగా సాగక, కొనుగోలు జరిగిన ధాన్యానికి సకాలంలో డబ్బులు రాక రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. రైతుకు 48 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా ధాన్యం డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణలో విఫలమ య్యాయ. ధాన్యం అమ్ముకున్న రైతులు రోజుల తరబడిగా ఐకెపి, పిఏసిఎస్, మార్కెటింగ్ అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ రబీ సీజన్‌లో ఇప్పటిదా కా కొనుగోలు చేసిన ధాన్యానికి సం బంధించి రైతులకు 111.49 కోట్ల రూపాయలు చెల్లించాల్సివుండగా, బుధవారం నాటికి కేవలం 15.26 కో ట్ల రూపాయలే చెల్లించారు.
కొనుగోలు తగ్గినా..
గత రబీ సీజన్‌లో లక్షా 44 వేల హెక్టార్లలో వరి పంటలు సాగవ్వగా, సన్న రకం ధాన్యం మినహాయించి దొడ్డు రకం 6 లక్షల 12,409 మెట్రిక్ టన్నుల దిగుబడి జరిగింది. కాగా, 268 ఐకెపి, పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల 20,679 టన్నులు ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేశాయి. అయతే ఈ సీజన్‌లో కరవుతో కేవలం 79,152 హెక్టార్లలో మాత్రమే వరి సాగు జరగగా, 3,35,570 టన్నుల దిగుబడి అంచనా వేసి ఇందులో 2 లక్షల టన్నులను ఐకెపి, పిఏసిఎస్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయన ప్పటికీ ఇప్పటిదాకా 227 కొనుగోలు కేంద్రాలకుగాను 172 కేంద్రాలు తెరిచి 15,250 మంది రైతులకు చెందిన 90,625 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మరో 83,205 టన్నులను కమిషన్ వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేశారు. బుధవారం కొనుగోలు ముగిసే సమయానికి ఐకెపి 70 కోట్ల 74 లక్షల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే, 8 కోట్ల 2 లక్షల రూపా యలనే రైతులకు చెల్లించింది. ఇక పిఏసిఎస్‌ల ద్వారా 48 కోట్ల 75 లక్షల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి, 7 కోట్ల 24 లక్షలు మాత్ర మే చెల్లించింది. 20 రోజుల కింద ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు కూడా నేటికీ చెల్లింపులు చేయకపోవడంతో రైతులు ఐకెపి, పిఏసిఎస్ కేంద్రాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్‌లైన్ చెల్లింపులు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయ. ఇక ఐకెపి కేంద్రాలకు తగినన్ని గన్నీ బ్యాగ్‌లు సరఫరాగాక అనేక కొనుగోలు కేంద్రాల్లో తరచూ కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వానికి 50 లక్షల గన్నీబ్యాగ్‌లకు ప్రతిపాదనలు పంపగా, 28,06,959 గన్నీ బ్యాగ్‌లు మంజూరయ్యాయ. ఇందులో కొనుగోలు కేంద్రాలకు 25,81,050 బ్యాగ్‌లనే సరఫరా చేశారు. ఫలితంగా గన్ని బ్యాగ్‌ల కొరత కొనుగోలు ప్రక్రియను దెబ్బతీస్తోంది. అటు అకాల వర్షాలతో ధాన్యం కుప్పలను వర్షాల బారి నుండి కాపాడుకునేందుకూ తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో లేవు. దీంతో రైతులు బిక్కు బిక్కుమంటూ పగలు, రాత్రి రాసుల వద్ద పడిగాపులు గాస్తున్నారు.