బిజినెస్

అంకుల్... ఉద్యోగం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పట్టుమని ఏడేళ్లు కూడా లేని ఓ పాప ఉద్యో గం కావాలని అడిగిందంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా స్కూల్లో చేరిందో లేదో తెలియదు కాని బ్రిటన్‌కు చెందిన షోలే బ్రిడ్జివాటర్ అనే ఏడేళ్ల బాలిక ఏకంగా గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్‌కే ఉద్యోగం కావాలంటూ లేఖ రాసింది. క్షణం తీరిక లేకుండా సంస్థ వ్యవహారాల్లో గడిపే సుందర్ పిచాయ్ ఆ చిన్నారి ఉద్యోగ అభ్యర్థన లేఖకు తీరిక చేసుకుని మరీ స్పందించారు. ఆయన ఇచ్చిన సమాధానం కూడా ఆ చిన్నారి తన భావి జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, ఎలా కష్టపడి పైకిరావాలో సూచించేదిగానే ఉంది. ‘కష్టపడి చదువుకుని నీ కలల ను సాకారం చేసుకునే ప్రయ త్నం చెయ్యి. చదువు పూర్తయిన తర్వాత గూగుల్ ఉద్యోగంకోసం దరఖాస్తు చేసుకో’ అని పిచాయ్ జవాబిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థల్లో అన్ని విధాలుగా ఉద్యోగస్తులకు అనువైనదని గూగుల్ సంస్థేనని, అక్కడ ఆదాయంతోపాటు ఉన్నత నాణ్యమైన ప్రమాణాలు, పనితీరు ఉంటాయని తన తండ్రి చెప్పడమే తడవుగా ఈ చిన్నారి తన వయస్సుతో నిమిత్తం కూడా ఉద్యోగంకోసం ఏకంగా ఆ సంస్థ సిఇవోకే లేఖ రాసేసింది.