బిజినెస్

జార్ఖండ్‌కు ఉజ్వల భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 16: అవినీతి, రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడ్డ జార్ఖండ్ జాతీయ సగటుకు ఎగువగా 4.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అపారమైన సహజ వనరుల సంపద, పెట్టుబడులకు అవకాశాలు ఇక్కడ విస్తృతంగా ఉన్నాయని జాతీయ సగటు కంటే కూడా వీటన్నింటి కారణంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కనీసం 4-5 శాతం ఎగువనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఇది జాతీయ సగటు కంటే ఒక శాతం అధికంగా ఉందని, త్వరలోనే 4-5 శాతానికి ఈ రాష్ట్రం వృద్ధిరేటు చేరుకుటుందని ఆయన స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో జరిగిన ప్రపంచ ఇనె్వస్టర్ల శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన జైట్లీ, దేశ స్థూల జాతీయ ఉత్పత్తి 2015-16 సంవత్సరంలో 7.6 శాతానికి చేరుకుందని తెలిపారు. జార్ఖండ్‌లో దీర్ఘకాలంపాటు రాజకీయ అనిశ్చితి నిలకొందని, ఇప్పుడా పరిస్థితి పోయి స్థిరమైన ప్రభుత్వం, అవినీతికి ఆస్కారం లేని పాలనా వ్యవస్థ రావడంతో దీని వృద్ధి అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. పట్టణీకరణ, వౌలిక సదుపాయాల అభివృద్ధి, హైవేలు-ఎయిర్ పోర్టులు-కొత్త నగరాల నిర్మాణంలో జార్ఖండ్ రాష్ట్రం వినూత్న రీతిలో ముం దుకు వెళుతోందని, పాలనలోనూ, వృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలోనూ ఎంతో పరిణితి సాధించిందని తెలిపారు.
జార్ఖండ్‌లో విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తగిన రీతిలో లాభాలుకూడా వస్తాయని జైట్లీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దాదాపు 2వేల మంది కూర్చుని పనిచేసేందుకు ఆస్కారం ఉన్న బిపిఓను జార్ఖండ్‌లో ఏర్పాటు చేయడానికి తాము సిద్ధం గా ఉన్నామని ఎస్సార్ సంస్థ తెలిపింది. ఇప్పటికే తాము జమ్‌షెడ్‌పూర్‌లో 2,500 సీట్ల బిపిఓను ఏర్పాటుచేశామని, ఇప్పుడు రాంచీలో కూడా 2వేల సామర్థ్యం కలిగిన బిపిఓ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఎస్సార్ సంస్థ చైర్మన్ శశి రూయియా స్పష్టం చేశారు.

చిత్రాలు....గ్లోబల్‌ఇనె్వస్టర్ సదస్సులో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ
*సదస్సుకు హాజరైన రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ధోని, వ్యాపారవేత్త నవీన్ జిందాల్