బిజినెస్

ఔషధ, బ్యాంకింగ్ షేర్లు ఆకర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు 5 నెలల గరిష్ఠ స్థాయిని తాకగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మరోసారి 8,800 మార్కును అధిగమించింది. సెనె్సక్స్ 167.48 పాయింట్లు ఎగిసి 28,468.75 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 43.70 పాయింట్లు అందుకుని 8,821.70 వద్ద నిలిచింది. ఔషధ, బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించగా, దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల విలువ 3.75 శాతం మేర పెరిగింది. బ్యాంక్‌లో విదేశీ మదుపరుల వాటా పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అనుమతివ్వడమే కారణం. ఈ క్రమంలోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ 1,450 కోట్ల రూపాయలు పెరగగా, సెనె్సక్స్ టాప్-10 సంస్థల జాబితాలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. మార్కెట్ విలువలో దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది తెలిసిందే. ఇక హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్, ఇండస్ట్రియల్స్ రంగాల షేర్ల విలువ 1.64 శాతం నుంచి 0.42 శాతం వరకు పెరిగింది. అయితే ఐటి, టెక్నాలజీ, మెటల్, టెలికామ్, ఆటో రంగాల షేర్ల విలువ 1.02 శాతం నుంచి 0.06 శాతం మేర పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలక సూచీలైన జపాన్, హాంకాంగ్, చైనాలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోను ప్రధాన సూచీలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు నష్టాల్లోనే కదలాడాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 134.50 పాయింట్లు, నిఫ్టీ 28.15 పాయింట్లు పెరిగాయి. సూచీలు లాభపడటం వరుసగా ఇది నాలుగోసారి.