బిజినెస్

సగానికి పడిపోయిన జియో ఇంటర్నెట్ వేగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఉచిత డేటా, కాల్స్ సదుపాయాలతో దేశీయ టెలికామ్ రంగంలో దూసుకెళ్తున్న సంచలన సంస్థ రిలయన్స్ జియో.. 4జి ఇంటర్నెట్ వేగం సగానికి పడిపోయింది. టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశీయ టెలికామ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ వేగం బాగుందని చెప్పింది. ఐడియా, వొడాఫోన్ సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉండగా, నాలుగో స్థానంలో జియో నిలిచినట్లు ట్రాయ్ నిర్వహించిన తాజా సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరిలో ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ డేటా వేగం 11.62 ఎమ్‌బిపిఎస్‌గా ఉంటే, ఐడియా 10.562, వొడాఫోన్ 10.301తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. జియో డేటా వేగం 8.345 ఎమ్‌బిపిఎస్‌గా ఉంది. డిసెంబర్‌లో ఇది 18.146 ఎమ్‌బిపిఎస్‌గా ఉండటం గమనార్హం. డిసెంబర్‌లో అన్నింటి కంటే కూడా జియో ఇంటర్నెట్‌దే వేగం ఎక్కువ.
మరోవైపు వొడాఫోన్-ఐడియా విలీనంలో అవసరమైతే జోక్యం చేసుకుంటామని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ స్పష్టం చేశారు. ఈ విలీనంతో ఏర్పడే సంస్థ.. దేశీయ టెలికామ్ రంగంలో అతిపెద్ద సంస్థగా మారనుంది. భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానానికి పడిపోతుందనే అంచనాలున్నాయి.