బిజినెస్

నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలదన్న విశ్వాసాన్ని పారిశ్రామిక సంఘం అసోచామ్ వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ పేమెంట్లు పెరుగుతుండటమే దీనికి కారణమంది. ‘ప్రభావవంతమైన సంస్కరణలతో ముందడుగేస్తున్న భారత్’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ మేరకు అభిప్రాయపడింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం ప్రకటించినది తెలిసిందే. వీటి స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తీసుకురాగా, రద్దయిన నోట్లను బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లను పొందే అవకాశాన్నీ ఇచ్చారు. అయితే తొలుత 2,000 రూపాయల నోట్లు చలామణిలోకి రావడంతో చిల్లర సమస్య తలెత్తింది. కేవలం 100, 50 అంతకంటే తక్కువ విలువైన కరెన్సీ నోట్లే మార్కెట్‌లో చలామణిలో ఉండటంతో 2,000 రూపాయల నోటు మార్పిడి కష్టతరమైంది. ఫలితంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొత్త 500 రూపాయల నోట్ల విడుదలలో జాప్యం కూడా వ్యాపార రంగాన్ని కుదేలు చేసింది. దీంతో దేశ వృద్ధిరేటు అంచనాలు పడిపోగా, ఆన్‌లైన్ పేమెంట్లను మోదీ సర్కారు ప్రోత్సహించింది. ఫలితంగా పరిస్థితులు మెరుగుపడగా, ఈ ఆన్‌లైన్ పేమెంట్లు భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో బలోపేతం చేస్తాయని అసోచామ్ చెబుతోంది.
వృద్ధిపథంలో బీమా వ్యాపారం
హైదరాబాద్: మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశీయ బీమా వ్యాపారం నాలుగు శాతం వృద్ధిరేటును నమోదు చేసుకోవచ్చని అసోచామ్ అంచనా వేసింది. అయన ప్పటికీ ప్రపంచ దేశాలతో పోల్చితే బీమా ప్రీమియం చెల్లింపుల్లో భారత్ వెనుకబడి ఉందని పేర్కొంది. క్రిందటిసారి 3.3 శాతం వృద్ధిరేటును నమోదు చేసిన బీమా వ్యాపారం.. ఈసారి నాలుగు శాతం వృద్ధిని సాధించవచ్చంది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను కేంద్రం ప్రారంభించిందని, వీటికి మంచి స్పందన వచ్చిందని అసోచామ్ పేర్కొంది. రైతుల కోసం కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించినట్లు గుర్తుచేసింది. పంటల నష్టం జరిగినప్పుడు దీన్ని అమలు చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఈ పాలసీ అమలుకు 5,501.15 కోట్ల రూపాయలను కేటాయంచినట్లు అసోచామ్ చెప్పింది. 2008లోనూ కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రీయ స్వస్త బీమా యోజన పథకాన్ని ప్రారంభించిందని వివరించింది. మొత్తంగా ప్రభుత్వ బీమా పథకాలు.. బీమా వ్యాపార వృద్ధికి దోహదపడుతు న్నాయంది. 2000 నుంచి 2009 వరకు బీమా రంగంలో వృద్ధిరేటు 2.71 శాతం నుంచి 5.20 శాతం వరకు పెరగడమే దీనికి నిదర్శనమంది.