బిజినెస్

‘ఆధార్’ గడువును పెంచిన ఇపిఎఫ్‌ఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్‌ను సమర్పించడానికి వచ్చే నెల 31వరకు గడువిచ్చింది ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్‌ఒ. ఇంతకుముందు ఈ నెల 28 వరకే ఈ గడువుండగా, దీన్ని మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు తాజాగా తెలిపింది. ఇపిఎఫ్‌ఒ పథకాల ప్రయోజనాలు అందడానికి ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేశారు. దీంతో జనవరి ఆరంభంలో ప్రకటించిన ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995కి కూడా సభ్యులందరూ ఆధార్ సంఖ్యలను దాఖలు పరచాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే తమ నాలుగు కోట్ల మంది సభ్యులు మార్చి 31లోగా ఆధార్ నెంబర్లను తెలియపరచాలని ఇపిఎఫ్‌ఒ చెబుతోంది.