బిజినెస్

నోట్ల రద్దుతోనే నల్లధనం పోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: నల్లధనం నిర్మూలనకు, వెలికితీతకు పాత పెద్ద నోట్ల రద్దు ఒక్కటే మార్గం కాదని, దాన్ని సర్వరోగ నివారిణిగా భావించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ సి రంగరాజన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ రవీంద్ర భారతిలో అఖిల భారత రిజర్వ్ బ్యాంకు ఉద్యోగ సంఘాల 32వ జాతీయ సమావేశాన్ని రంగరాజన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రంగరాజన్ ప్రసంగిస్తూ నల్లధనం నిర్మూలనకు చేపట్టే చర్యల్లో పాత పెద్ద నోట్ల రద్దు ఒక భాగమే తప్ప, పెద్ద నోట్ల రద్దుతోనే నిర్మూలన జరుగుతుందని అనుకోరాదన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత కొత్త నోట్ల కొరత వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా కూరగాయల అమ్మకందారులు, మత్స్యకార్మికులు, చిరు వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, రోజువారీ కూలీలు ఇబ్బంది పడ్డారని ఆయన చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థపై వెంటనే ప్రభావం చూపించిందని తెలిపారు. అయతే నగదు లావాదేవీలు క్రమేణా తగ్గి, డిజిటల్ రూపేణా లావాదేవీలకు అలవాటుపడుతున్నారన్న ఆయన పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులు క్రమంగా తొలిగిపోయి సాధారణ పరిస్థితులు వచ్చాయని అంగీకరించారు. ఇంకా అవసరమైన మేర కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకుని వచ్చి ఆ వివాదానికి తెర దించాలని ఆయన సూచించారు. రాబోయే దశాబ్దాలు భారత్‌కు చాలా కీలకమైనవని, జిడిపి వృద్ధితోనే సామాజిక, ఆర్థిక సమస్యలు దూరమవుతాయని ఆయన తెలిపారు. కాగా, దారిద్య్ర నిర్మూలన జరగాల్సి ఉందని, దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగించింది కాబట్టి పాలకులు కొత్తగా పెట్టుబడులు వచ్చేలా వాతావరణం కల్పించాలని, అప్పుడే కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని రంగరాజన్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శాంతియుత వాతావరణం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం పురోగతి సాధిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ జి హరగోపాల్ మాట్లాడుతూ పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలు బ్యాంకుల వద్ద భారీ ‘క్యూ’ల్లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చిందని అన్నారు. రెండున్నర సంవత్సరాలుగా వివిధ వర్సిటీలకు విసిలు లేరని, కొన్ని వర్సిటీలు సంక్షోభంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమావేశంలో ఎఐఆర్‌బిఇ అసోసియేషన్ నాయకులు ప్రసంగించారు.