బిజినెస్

‘రూ. 100 కోట్ల వ్యాపారానికి దెబ్బ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 100 కోట్ల రూపాయల మార్కెట్ దెబ్బతిన్నదని ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం నెస్లే సోమవారం తెలిపింది. నోట్ల రద్దు ప్రభావం మరో ఆరు నెలలు ఉండవచ్చని అంచనా వేసింది. నవంబర్‌లో అధికంగా ప్రభావితమయ్యామని, ఇప్పటిదాకా చూసుకుంటే 100 కోట్ల రూపాయల అమ్మకాలు తగ్గిపోవచ్చని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ నారాయణన్ అన్నారు. ఇదిలావుంటే ప్రీమియమ్ కాఫీ వ్యాపారం, పెట్ కేర్, చర్మ సౌందర్యం, తృణధాన్యాల వంటి విభాగాల్లోకి ప్రవేశించే యోచనలో నెస్లే ఉంది.