బిజినెస్

టాటా గ్రూప్‌ను అగ్రపథాన నడిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 21: టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న టాటా సన్స్‌కు చైర్మన్‌గా అన్ని సంస్థలకు సమాన ప్రాధాన్యం ఇస్తానని, నిధుల కేటాయింపులు పద్ధతిగా జరుపుతామని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. టాటాలు దేన్నీ అనుసరించరని, ఎందులోనైనాసరే వారి ఆధిపత్యమే ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. నిరుడు అక్టోబర్ 24న సైరస్ మిస్ర్తి టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైనది తెలిసిందే. టాటా గ్రూప్‌లోని కొన్ని సంస్థల నిర్వీర్యానికి మిస్ర్తి కుట్రపన్నారంటూ ఆయన్ను గ్రూప్‌లోని ఒక్కో సంస్థ బోర్డుల నుంచీ తప్పించారు. ఈ క్రమంలో రతన్ టాటాకు టాటా సన్స్ బాధ్యతలు తాత్కాలికంగా అప్పగించగా, టాటా నేతృత్వంలోని కమిటీ.. 53 ఏళ్ల చంద్రశేఖరన్‌కు పగ్గాలు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశీయ ఐటి రంగ దిగ్గజమైన టిసిఎస్‌కు సారథ్యం వహిస్తున్న చంద్రశేఖరన్.. చారిత్రాత్మక టాటా గ్రూప్‌నకు నాయకుడయ్యారు. మరోవైపు టాటా సన్స్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్‌పై ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పొగడ్తలు గుప్పించారు. టాటా సన్స్ బోర్డు సభ్యులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇదిలావుంటే చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ కావడంతో ఆయన స్థానంలో టిసిఎస్ సిఇఒగా ఎన్నికైన గోపీనాథన్ మాట్లాడుతూ టిసిఎస్ వృద్ధిరేటు నిలకడగా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం..మంగళవారం బాంబే హౌస్‌కు చేరుకున్న టాటా సన్స్ కొత్త చైర్మన్
ఎన్ చంద్రశేఖరన్, మాజీ చైర్మన్ రతన్ టాటా