బిజినెస్

విప్రో లాభం రూ. 2,235 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 20: దేశీయ ఐటిరంగంలో మూడో అతిపెద్ద సంస్థ విప్రో ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 1.6 శాతం పడిపోయింది. 2,235 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 2,272 కోట్ల రూపాయల లాభాన్ని విప్రో అందుకుంది. అయితే ఆదాయం మాత్రం 12.9 శాతం పెరిగినట్లు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు విప్రో తెలిపింది. 12,171.4 కోట్ల రూపాయల నుంచి 13,741.7 కోట్ల రూపాయలకు ఎగిసింది.
15 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యం
2020 నాటికి 15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని విప్రో తెలిపింది. 2015-16లో సంస్థ వార్షిక ఆదాయం 7.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్రమంలో రాబోయే నాలుగేళ్లలో ఈ ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని విప్రో సిఇఒ, బోర్డు సభ్యుడు అబిదాలి నీముచ్‌వాలా చెప్పారు.
షేర్ల బైబ్యాక్
మరోవైపు దాదాపు 2,500 కోట్ల రూపాయల విలువైన 4 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు విప్రో తెలిపింది. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో విప్రో షేర్ విలువ 601.35 రూపాయల వద్ద ముగిసిన క్రమంలో ఒక్కో షేర్‌ను 625 రూపాయల చొప్పున మదుపరుల నుంచి విప్రో కొనుగోలు చేయనుందని విప్రో సిఎఫ్‌ఒ జతిన్ దలాల్ తెలిపారు.