బిజినెస్

వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 21: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ జియో ప్రకటనతో టెలికామ్ షేర్లు నష్టపోయినప్పటికీ గత మూడు రోజుల లాభాలను కొనసాగిస్తూ నాలుగో రోజైన మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ లాభపడ్డాయి. సెనె్సక్స్ 100.01 పాయింట్లు పెరిగి 28,761.59 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 28.65 పాయింట్లు అందుకుని 8,907.85 వద్ద నిలిచింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, చమురు, గ్యాస్, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆటో రంగాల షేర్ల విలువ 2.44 శాతం నుంచి 0.27 శాతం పెరిగింది. టెలికామ్, టెక్నాలజీ, ఐటి రంగాల షేర్ల విలువ 2.35 శాతం నుంచి 0.17 శాతం తగ్గింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలకమైన సూచీల్లో జపాన్, చైనా సూచీలు లాభపడితే, హాంకాంగ్ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీల్లో జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు లాభపడగా, బ్రిటన్ సూచీ నష్టపోయింది.