బిజినెస్

గ్రామీణ డిజిటలైజేషన్‌పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సారథి, భారత సంతతి సిఇఒ సత్య నాదెళ్ల మంగళవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిశారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న నాదెళ్ల.. రవిశంకర్ ప్రసాద్‌తో మైక్రోసాఫ్ట్ గ్రామీణ డిజిటలైజ్ కార్యక్రమాలు, ఉపాధి కల్పన, ఉద్యోగ సృష్టి తదితర అంశాలపై చర్చించారు. ‘్భరత్‌లో మైక్రోసాఫ్ట్ పనితీరు బాగుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలు అభినందనీయం. మహారాష్టల్రోని హరిసాల్ పైలట్ ప్రాజెక్టు ప్రశంసనీయం. అక్కడి వారికి డిజిటల్ హెల్త్, డిజిటల్ ఎడ్యుకేషన్‌తో టెక్నాలజీని చేరువ చేసింది మైక్రోసాఫ్ట్.’ అని నాదెళ్లతో 30 నిమిషాల సమావేశం అనంతరం ప్రసాద్ అన్నారు. అత్యుత్తమ ఉద్యోగావకాశాలకు కావాల్సిన నైపుణ్యాభివృద్ధికి లింకెడిన్ పాత్ర చాలా ఉందన్నారు. అయితే హెచ్-1బి వీసా అంశం నాదెళ్లతో చర్చకు రాలేదన్నారు.
భారతీయ ఐటి రంగానికి ప్రధానమైన హెచ్-1బి వీసాల విషయంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపట్ల నాదెళ్లతోపాటు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసినది తెలిసిందే. టాలెంట్‌ను అడ్డుకోవడమేనంటూ అభిప్రాయపడ్డారు. భారత యువతకు మద్దతుగా వారు మాట్లాడారంటూ మంత్రి కితాబిచ్చారు. కాగా, సత్య నాదెళ్ల.. సుపరిపాలనకు డేటా వినియోగం, క్లౌడ్ కంప్యూటింగ్‌పై సీనియర్ ప్రభుత్వ అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారని నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నాదెళ్లకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా ‘స్టేట్ ఫార్వర్డ్’ అనే శీర్షిక కలిగిన పుస్తకాన్ని బహూకరించారు.