బిజినెస్

పిసి, మొబైల్స్‌కు ఉచిత యాంటీవైరస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖ.. మంగళవారం యాంటీమాల్వేర్ అనాలసిస్ సెంటర్‌ను ప్రారంభించింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లకు ఇది ఉచితంగా యాంటీవైరస్‌ను అందిస్తుంది. 90 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయగా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ సెంటర్ ప్రోత్సాహకంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తం చేశారు. కాగా, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. ఇన్‌ఫెక్టెడ్ సిస్టమ్స్ డేటాను సేకరించి, దాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులకు అందిస్తుందని చెప్పారు. ఇప్పటిదాకా 58 ఇంటర్నెట్ ప్రొవైడర్లు, 13 బ్యాంకులు ఈ ఉచిత సేవలను అందుకోవడానికి ముందుకొచ్చాయన్నారు.