బిజినెస్

లోకల్, ఎస్‌టిడి కాల్స్ ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ సంచలన 4జి టెలికామ్ సంస్థను మరింత సంచలనాత్మకంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైన ఆయన ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తున్న న్యూ ఇయర్ ఆఫర్ ప్రయోజనాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. అయితే రోజుకు 10 రూపాయల చొప్పున నెలకు 303 రూపాయల చార్జితో ఈ ఉచిత డేటా ప్రయోజనాలను జియో ప్రస్తుత కస్టమర్లు పొందవచ్చన్నారు. 99 రూపాయల వన్‌టైమ్ ఫీజునూ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటాకు సంబంధించి ఉచిత ఆఫర్లతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ముకేశ్ అంబానీ.. లోకల్, ఎస్‌టిడి వాయస్ కాల్స్, రోమింగ్ ఉచితమని ప్రకటించారు. మార్కెట్‌లో పోటీయుత ఆఫర్లనిస్తామని, ప్రత్యర్థి సంస్థల కంటే 20 శాతం తక్కువకే సేవలందిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సంస్థకు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్‌పై ముకేశ్ ప్రసంగించారు. సంస్థ సాధిస్తున్న విజయాలు తమ కస్టమర్లు అందించినవేనన్న ఆయన నిరుడు సెప్టెంబర్ 5న మొదలైన జియో ప్రయాణంలో 100 మిలియన్ల మంది భాగస్వాములయ్యారన్నారు. ఈ ఏడాది ఆఖరుకల్లా దేశంలోని అన్ని ప్రాంతాలకు జియో సేవలను విస్తరిస్తామని, 99 శాతం జనాభాను చేరుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మిగతా సంస్థలతో పోల్చితే 4జి సమాచార వ్యవస్థ.. జియోకే అధికంగా ఉందని చెప్పారు.
పరిశ్రమకు ఉపశమనం: సిఒఎఐ
మరోవైపు జియో తాజా ప్రకటనతో టెలికామ్ పరిశ్రమలో ఇతర సంస్థలకు కొంత ఉపశమనం లభించిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సిఒఎఐ) వ్యాఖ్యానించింది. ఆరు నెలల క్రిందట 4జి సేవలతో దేశీయ టెలికామ్ రంగంలోకి అడుగిడిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఇప్పటివరకు ఉచితంగానే సేవలు అందిస్తున్నది తెలిసిందే. వచ్చే నెల 31దాకా ఈ ఉచిత సేవలు కొనసాగనున్నాయి. అయితే ఆ తర్వాతి నుంచి స్వల్పంగా చార్జీలు వసూలు చేస్తామని తాజాగా సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ చెప్పారు. నిజానికి నిరుడు డిసెంబర్ 31 వరకే తొలుత ఉచిత సేవలని ప్రకటించిన జియో.. న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దీనిపై భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ టిడిశాట్‌లో ఫిర్యాదు కూడా చేయగా, టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ తీరుపైనా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏప్రిల్ 1 నుంచి ఇక జియో ఉచిత సేవలు ఆగిపోతాయని, ఎంతోకొంత చార్జీలు వసూలు చేస్తున్నందున కొంత నయమని, దీనివల్ల ప్రత్యర్థి సంస్థల వ్యాపారం పెరగవచ్చని సిఒఎఐ అంటోంది. ఇప్పటికే జియో ఉచిత ఆఫర్లతో ఎయిర్‌టెల్ లాభాలు పడిపోగా, ఐడియా నష్టాలపాలైనది తెలిసిందే.
ఎయిర్‌టెల్, ఐడియా షేర్లు కుదేలు
రిలయన్స్ జియో వినియోగదారులు 10 కోట్లకు చేరారంటూ ముకేశ్ అంబానీ చేసిన ప్రకటనతో మంగళవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, ఇన్‌ఫ్రాటెల్ తదితర టెలికామ్ సంస్థల షేర్లన్నీ కుదేలయ్యా యి. 4 శాతానికిపైగా విలువను కోల్పోయా యి. జియో 4జి టవ ర్లు ప్రత్యర్థి సంస్థలతో పోల్చితే రెట్టిం పు కంటే ఎక్కువగానే ఉన్నాయని, నెలకు జియో నెట్‌వర్క్‌పై 100 కోట్ల రూపాయలకుపైగానే విలువైన డేటా వినియోగం జరుగుతోందని ముకేశ్ చెప్పారు. ఇది రోజుకు 3.3 కోట్ల జిబితో సమానమన్నారు. కాగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఎయిర్‌టెల్ షేర్ విలువ అత్యధికంగా 4.02 శాతం పడిపోయి 360.55 వద్ద స్థిరపడింది. ఐడియా షేర్ విలువ 0.37 శాతం దిగజారి 108.30 వద్ద నిలిచింది. మరోవైపు రిలయన్స్ షేర్ల విలువ 1.36 శాతం పెరిగి 1,088.25 వద్దకు చేరింది. ఈ నెలలో సుమారు 4 శాతం షేర్ల విలువ పెరగడం గమనార్హం.