బిజినెస్

విస్తరణ బాటలో ఐటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైటెక్ సిటీ హైదరాబాద్‌కే పరిమితం కాదు. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీలు రానున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌కే పరిమితమైన ఐటి కంపెనీలు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో జిల్లాల్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రూరల్ టెక్నాలజీ సెంటర్ పాలసీ వల్ల ఐటి కంపెనీలు కరీంనగర్, వరంగల్ నగరాలపై దృష్టిని సారించాయి. హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ ఐటి కంపెనీలతో ప్రపంచ పటంలో తన ఉనికిని చాటుకుంది. హైదరాబాద్ కాకుండా జిల్లాల్లో ఐటి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న కొత్త విధానంతో కరీంనగర్ జిల్లాలో రెండు ఐటి సంస్ధలు యూనిట్లను నెలకొల్పాయి. టెలికా నెట్‌వర్క్ టెక్నాలజీ సంస్ద కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఒక యూనిట్‌ను నెలకొల్పింది. ఈ సంస్ధ 20 మంది ఐటి వర్కర్లను నియమించింది. ఎక్‌లాట్ ఇన్ఫో టెక్ అనే సంస్ధ కరీంననగర్‌లో ఐటి యూనిట్‌ను ఏర్పాటు చేసి కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా రూ. 40 లక్షల లోపు పెట్టుబడులతో జిల్లాల్లో ఐటి కంపెనీలను నెలకొల్పనున్నట్లు అనేక సంస్ధలు ముందుకు వస్తున్నాయి. మహబూబ్‌నగర్, పెద్దపల్లి, భువనగిరి, వరంగల్, జనగాం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఐటి కంపెనీలు నెలకొల్పేందుకు వచ్చిన ప్రతిపాదనలను ఐటి శాఖ పరిశీలిస్తోంది.
తెలంగాణ గవర్నమెంట్ రూరల్ టెక్నాలజీ సెంటర్ పాలసీ కింద జిల్లాల్లో ఐటి కంపెనీలను ఏర్పాటు చేస్తే ఆ సంస్ధకు మూడేళ్ల పాటు ఇంటర్నెట్ చార్జీల్లో 25 శాతం సబ్సిడీ ఇస్తారు. చదరపు అడుగు స్ధలంపై 25 శాతం వరకు సబ్సిడీ ఇస్తారు. మూడేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. సంవత్సరానికి కనీసం 50 మంది ఐటి వర్కర్లను నియమిస్తే, సాలీనా ఒక వర్కర్‌కు రూ.20 వేల చొప్పున రిక్రూట్‌మెంట్ అసిస్టెన్స్ కింద ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఐటిలో శిక్షణ ఇచ్చినందుకు ట్రైనింగ్ సబ్సిడీ కింద రూ. 2500ను ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన నైపుణ్య కేంద్రాలకు కూడా మంచి స్పందన వస్తోందని ఐఐఐటి హైదరాబాద్ ఫ్యాకల్టీ ఎల్ రమేష్ చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నైపుణ్య కేంద్రాలు, ఐటి సంస్ధల మధ్య అనుసంధానం నెలకొల్పే విధానాన్ని త్వరలో ప్రకటించనుంది. హైదరాబాద్, వరంగల్‌లో టి హబ్‌లు విజయవంతం కావడంతో, వీటిని జిల్లాలకు కూడా విస్తరించాలని ఐటి శాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులకు ఐటి కంపెనీల్లో ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఆదిలాబాద్ తప్ప ఏ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్న మూడునుంచి నాలుగు గంటల సమయం సరిపోతుంది. పైగా రవాణా వౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయింది. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, జిల్లాలకు విస్తరించడం వల్ల వికేంద్రీకరణ జరుగుతుందని టిఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్ తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఐటి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ మంచి అనుకూలమైనరాష్టమ్రని, శంషాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు వివిధ జిల్లాలకు సులువుగా చేరుకునేందుకు రోడ్డు సదుపాయాలు, అపారమైన మానవ వనరులు, శిక్షణ ఇచ్చేందుకు ఐటి నిపుణులు అందుబాటులో ఉండడం సానుకూలమైన పాయింట్లని సిఐఐ తెలంగాణ అధ్యక్షు నృపేందర్ రావు తెలిపారు.