బిజినెస్

భారత్.. ఇప్పటికీ పేద దేశమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 20: భారత ఆర్థిక వ్యవస్థ బలంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అంటూ అతిగా అంచనాలు వేయవద్దని, ఇప్పటికీ పేద దేశాల్లో భారత్ ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆర్థికంగా దేశ బలోపేతానికి ఇంకా చేయవలసింది చాలానే ఉందని ఆర్‌బిఐ గవర్నర్ రాజన్ బుధవారం అన్నారు. అమెరికా పర్యటనలో భారత్‌ను ప్రపంచ వెలుగు రేఖగా అభివర్ణించడంపై రాజన్ స్పందిస్తూ ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను గలవాడే రాజు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో కాస్తోకూస్తో బాగున్న భారత్‌ను ఇతర దేశాలతో పోల్చితే మెరుగ్గా కనిపిస్తోంది. అంతమాత్రం చేత భారత ఆర్థిక వ్యవస్థ బాగున్నట్లు కాదు.’ అన్నది తెలిసిందే. అలాగే 1960లో భారత్ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ చిన్నదని, ఇప్పుడు భారత్ కంటే ఐదు రెట్లు పెద్దదని కూడా అన్నారు. బ్రిక్స్ దేశాల్లో తలసరి ఆదాయం ప్రకారం భారతే దిగువ స్థానంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో జైట్లీ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని, తమ ప్రభుత్వ సంస్కరణల మధ్య ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తే భారత జిడిపి పరుగులు పెట్టడం ఖాయమని అన్నది విదితమే. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, మరికొందరు కేంద్ర మంత్రులు కూడా రాజన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఇక్కడ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ స్నాతకోత్సవంలో రాజన్ మాట్లాడుతూ ప్రస్తుత దేశ వృద్ధిరేటు రాబోయే 20 ఏళ్లలో నిలకడగా కొనసాగితేనే ప్రతి భారతీయుడికి మంచి జీవితం లభిస్తుందన్నారు.
రాజన్ క్షమాపణలు
మరోవైపు ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అన్న వ్యాఖ్యలు దృష్టి లోపం కలిగినవారిని, అంధులను బాధించినట్లైతే క్షమించాలని రాజన్ కోరారు. ‘నేను క్షమాపణలు కోరుతున్నాను. ఆ వ్యాఖ్యలు మీ మనసును గాయపరిచినందుకు క్షమించండి.’ అన్నారు.