బిజినెస్

ఎయిర్‌టెల్ చేతికి టెలినార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశంలోని ప్రధాన టెలికామ్ ఆపరేటర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తన ఏడు సర్కిళ్లలో టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి టెలినార్ సౌత్ ఏషియా ఇనె్వస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ గురువారం వెల్లడించింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందం విలువ ఎంతన్నదీ ఇటు ఎయిర్‌టెల్ గానీ, అటు టెలినార్ సంస్థ గానీ వెల్లడించలేదు. ఇదిలావుంటే, టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందాన్ని కుదుర్చుకుందన్న సమాచారం వెలువడటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎయిర్‌టెల్ షేర్ విలువ 11 శాతం వృద్ధి చెందింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)లో ఎయిర్‌టెల్ షేర్ విలువ 10.93 శాతం వృద్ధితో 400 రూపాయల 65 పైసలకు పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీలో దీని విలువ 11 శాతం వృద్ధితో 401 రూపాయలకు పెరిగి 12 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.

చిత్రం..న్యూఢిల్లీలో గురువారం టెలినార్ సిఇఓ సిగ్వీ బ్రెక్కెతో కరచాలనం చేస్తున్న భారతీ ఎయర్‌టెల్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్