బిజినెస్

స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభంలో భారీ లాభాల్లో కొనసాగినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆరంభంలో ఆర్జించిన లాభాలను దాదాపుగా కోల్పోయి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఒక దశలో 29 వేల పాయింట్ల స్థాయిని దాటినప్పటికీ ఆ తర్వాత ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలోమదుపరులు అమ్మకాలకు దిగడంతో ఒత్తిడికి లోనయి చివరికి 28 పాయింట్ల స్వల్ప లాభంతో 28,892.97 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 12.60 పాయింట్లు లాభపడి 8,939.50 పాయింట్ల వద్ద ముగిసింది. టెలెనార్ ఇండియాను స్వాధీనం చేసుకోనున్నట్లు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రకటించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేరు ఒక దశలో 11 శాతం పెరిగింది. అయితే చివరికి 1.36 శాతం వృద్దితో సరిపుచ్చుకొంది. సెనె్సక్స్ లాభాలతో ముగియడం వరసగా ఇది ఆరో రోజు. ఈ ఆరు రోజుల్లో సెనె్సక్స్ 737 పాయింట్లకు పైగా లాభపడింది. 2016 జూన్ 27నుంచి జూలై 4 వరకు లాభాల బాటలో సాగిన తర్వాత సెనె్సక్స్ ఇన్ని రోజులు వరసగా లాభాల్లో సాగడం ఇదే మొదటిసారి. ఉదయం నుంచి మార్కెట్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపించడంతో మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. ఫలితంగా మధ్యాహ్నం సమయానికి సెనె్సక్స్ 29,065.31 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీ తీవ్ర ఒత్తిడికి గురయింది. కాగా, ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీలన్నీ నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలో ప్రారంభంలో మిశ్రమ ధోరణి కనిపించింది. సెనె్సక్స్ కంపెనీల్లో టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఐటిసి, సన్‌ఫార్మా, సిప్లా షేర్లు మంచి లాభాలు గడించగా, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్,ఎన్‌టిపి, హిందుస్థాన్ యూనిలీవర్, మారుతి షేర్లు నష్టపోయాయి.