బిజినెస్

బంగారం బాండ్ల పథకం.. 27న ఏడో విడత ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కేంద్ర ప్రభుత్వం వచ్చే సోమవారం ఏడో విడత సావరిన్ గోల్డ్ బాండ్ల పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద జనం 500 గ్రాముల బంగారందాకా విలువైన బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బంగారు బాండ్లను జారీ చేయడం ఇదే చివరి విడత కానుంది. ఈ బాండ్ల కోసం దరఖాస్తులను ఫిబ్రవరి 27నుంచి మార్చి 3 వరకు స్వీకరించడం జరుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన దరఖాస్తుదారులకు బాండ్లను మార్చి 17న జారీ చేస్తారని ఆ ప్రకటన తెలిపింది. బంగారానికి ప్రత్యామ్నాయ పెట్టుబడుల పథకం అయిన ఈ గోల్డ్‌బాండ్స్ పథకాన్ని ప్రభుత్వం 2015 నవంబరులో ప్రవేశపెట్టింది. బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి బదులుగా మదుపరులు ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఇప్పటిదాకా అయిదు విడతలుగా జారీ చేసిన బంగారం బాండ్ల ద్వారా ప్రభుత్వం రూ.3,060 కోట్లు సమీకరించింది. ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే ఈ బాండ్లు బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సిఐఎల్), ఎంపిక చేసిన పోస్ట్ఫాసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎఖ్స్‌చేంజిలు, ఎన్‌ఎస్‌సి, బిఎస్‌ఇల ద్వారా విక్రయిస్తారు. ఈ బాండ్లపై ఏడాదికి 2.50 శాతం ఫిక్స్‌డ్ రేటుపై వడ్డీ చెల్లిస్తారు. 8 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లను అయిదేళ్ల తర్వాత ఎప్పుడైనా నగదుగా మార్చుకోవచ్చు. వారంలో బంగారం ముగింపు ధర సగటు ఆధారంగా బాండ్ ధరను నిర్ణయిస్తారు. కాగా, రుణాలకోసం తనఖాగా కూడా ఈ బాండ్లను ఉపయోగించుకోవచ్చు.