బిజినెస్

శ్రీసిటీలో పార్క్‌సన్ ప్యాకేజింగ్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఫిబ్రవరి 24: నెల్లూరు- చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటీ పారిశ్రామిక వాడలో శుక్రవారం ముంబయకి చెందిన పార్క్‌సన్ ప్యాకేజింగ్ లిమిటెడ్ నూతన పరిశ్రమను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రమేష్ కేజ్రీవాల్, బాబ్స్ గ్రూప్ సిఇఒ జీన్ పాప్కల్ బాబ్స్, హెడిల్‌బర్క్ గ్రూప్ హెడ్ స్టీఫెన్ ఫ్లంజ్‌లు పాల్గొన్నారు.
ప్రింటెడ్ ల్యామినేటెడ్ హోర్డింగ్ కార్బన్ పెట్టెల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థకు ఇప్పటికే దేశంలో నాలుగు యూనిట్లుండగా ఐదవ యూనిట్ ఇక్కడ నెలకొల్పారు. ఈ సందర్భంగా రమేష్ కేజ్రీవాల్ మాట్లాడుతూ 1986లో ముంబయ సమీపంలో తమ తొలి ప్లాంట్‌ను ప్రారంభించామన్నారు. శ్రీసిటీలో తాజా ప్లాంట్ ఏర్పాటుతో దేశం అంతటా తమ వ్యాపార లావాదేవీలు విస్తరించినట్టు అయందని తెలిపారు. త్వరలో ఆరవ ప్లాంట్‌ను అసోంలోని గౌహతీలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కాగా, ప్యాకేజి రంగంలో పేరెన్నికగన్న ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కావడం పట్ల శ్రీసిటీ ఎండి హర్షం వ్యక్తం చేశారు.
శ్రీసిటీలో ఆహార శుద్ధి, పానీయాలు, ఇతర తయారీ పరిశ్రమలు 150కిపైగా ఉన్నాయని, ఈ పరిశ్రమలన్నింటికి ప్రయోజనకరంగా పార్క్‌సన్ ప్యాకే జింగ్ ఉంటుందన్న ఆశాభా వాన్ని వెలిబుచ్చారు. పది ఎకరాల విస్తీర్ణంలో 70 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 200 మందికి ఉద్యోగాలు కలుగుతాయన్నారు.

చిత్రం..ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు